NTV Telugu Site icon

Hyderabad: రాచకొండ పరిధిలో గన్స్ విక్రయం.. మూడు తుపాకులు స్వాధీనం..

Adilabad Guns

Adilabad Guns

రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా సభ్యులకు తెలిసిన వాళ్ళు ఉండటంతో గన్స్ తీసుకొచ్చింది..

READ MORE: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments