ఆస్తుల కోసం అయినవారిని పొట్టనబెట్టుకుంటున్నారు. ఆస్తి తమకే దక్కాలన్న దురాశతో అన్నదమ్ములను, అక్కాచెల్లెల్లను, తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లి కూతురిని హత్య చేసింది. మేడిపల్లిలో దారుణ హత్యకు గురైన మహేశ్వరి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరిని హత్య చేసింది సవతి తల్లి లలిత ఆమె మరిది రవి అతని స్నేహితుడు వీరన్నలుగా పోలీసులు గుర్తించారు.
Also Read:AP Inter Results 2025: ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మహేశ్వరి తండ్రి పీనా నాయక్ ఫిర్యాదు మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. విచారణలో మహేశ్వరిని హత్య చేసినట్లు లలిత, రవి, వీరన్నలు అంగీకరించారు. శాలిగౌరారంలోని వంగవర్తి వాగులో నాలుగు నెలల తరువాత మహేశ్వరి డెడ్‌బాడి బయటపడింది. వాగు వద్దే పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు.. జనగామలోని ధర్మపురంకు అంత్యక్రియల కోసం మహేశ్వరి డెడ్ బాడీని తీసుకొని వెళ్లాడు తండ్రి పీనా నాయక్.