POK: పీఓకేలో తిరుగుబాటు.? పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జెన్-Z నిరసనలు..
- పీఓకేలో తిరుగుబాటు తప్పదా..
- నెల తిరగకముందే మరో ఉద్యమం..
- ఈసారి జెన్-జీ నేతృత్వంలో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇటీవల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో, విద్యార్థులు టైర్లు తగలబెట్టడంతో పాటు విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లోని షెహజాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేపాల్, బంగ్లాదేశ్ లోని విద్యార్థి ఉద్యమం తరహాలో ఈ నిరసనలు కూడా ఎగిసిపడుతున్నాయి.
పెరుగుతున్న ఫీజులు, మెరుగైన సౌకర్యాల డిమాండ్‌పై ముజఫరాబాద్ లోని యూనివర్సిటీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయమి. సెమిష్టర్ ఫీజుల పేరుతో ప్రతీ 3-4 నెలలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. కొత్తగా డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్(ఈ-మార్కింగ్) ప్రవేశపెట్టడంపై వీరు ఆగ్రహంగా ఉన్నారు. పీఓకేలో అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. వీటిలో ఊహించిన దాని కన్నా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. దీనికి ఈ విధామనే కారణమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు పాస్ అయినట్లు ఆరోపిస్తున్నారు.
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Read Also: Google Watch 4: భారత్ లో గూగుల్ పిక్సెల్ వాచ్ 4 సేల్ ప్రారంభం.. ధర ఇన్ని వేలా?
గత నెలలో హింసాత్మక అల్లర్లు:
పన్నుల నుంచి ఉపశమనం, పిండి, విద్యుత్ పై సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం వంటి 30 డిమాండ్లపై గత నెలలో పీఓకే అట్టుడికింది. ఈ అల్లర్లలో 12 మందికి పైగా పౌరులు మరణించారు. చివరకు షరీఫ్ ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుని, కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించడంతో ఈ అల్లర్లు సద్దుమణిగాయి.
అయితే, ఈసారి మాత్రం యువత పెద్ద ఎత్తున పీఓకేలో నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్-జీ ఉద్యమాన్ని తలపిస్తోంది. 2024లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూడా విద్యార్థుల ఉద్యమమే కుప్పకూల్చింది. ఆమె పారిపోయి భారత్ రావాల్సి వచ్చింది. ఈ ఏడాది నేపాల్‌లో విద్యార్థి ఉద్యమాన్ని కేపీ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఇక పాకిస్తాన్‌లో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!