Site icon NTV Telugu

POK: పీఓకేలో తిరుగుబాటు.? పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జెన్-Z నిరసనలు..

Pok

Pok

POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇటీవల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో, విద్యార్థులు టైర్లు తగలబెట్టడంతో పాటు విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లోని షెహజాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేపాల్, బంగ్లాదేశ్‌ లోని విద్యార్థి ఉద్యమం తరహాలో ఈ నిరసనలు కూడా ఎగిసిపడుతున్నాయి.

పెరుగుతున్న ఫీజులు, మెరుగైన సౌకర్యాల డిమాండ్‌పై ముజఫరాబాద్ లోని యూనివర్సిటీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయమి. సెమిష్టర్ ఫీజుల పేరుతో ప్రతీ 3-4 నెలలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. కొత్తగా డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్(ఈ-మార్కింగ్) ప్రవేశపెట్టడంపై వీరు ఆగ్రహంగా ఉన్నారు. పీఓకేలో అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. వీటిలో ఊహించిన దాని కన్నా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. దీనికి ఈ విధామనే కారణమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు పాస్ అయినట్లు ఆరోపిస్తున్నారు.

Read Also: Google Watch 4: భారత్ లో గూగుల్ పిక్సెల్ వాచ్ 4 సేల్ ప్రారంభం.. ధర ఇన్ని వేలా?

గత నెలలో హింసాత్మక అల్లర్లు:

పన్నుల నుంచి ఉపశమనం, పిండి, విద్యుత్ పై సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం వంటి 30 డిమాండ్లపై గత నెలలో పీఓకే అట్టుడికింది. ఈ అల్లర్లలో 12 మందికి పైగా పౌరులు మరణించారు. చివరకు షరీఫ్ ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుని, కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించడంతో ఈ అల్లర్లు సద్దుమణిగాయి.

అయితే, ఈసారి మాత్రం యువత పెద్ద ఎత్తున పీఓకేలో నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్-జీ ఉద్యమాన్ని తలపిస్తోంది. 2024లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూడా విద్యార్థుల ఉద్యమమే కుప్పకూల్చింది. ఆమె పారిపోయి భారత్ రావాల్సి వచ్చింది. ఈ ఏడాది నేపాల్‌లో విద్యార్థి ఉద్యమాన్ని కేపీ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఇక పాకిస్తాన్‌లో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Exit mobile version