Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
- బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత
- కెమికల్ పౌడర్ వాసన పీల్చి అస్వస్థతకు గురైన విద్యార్థులు
- ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kendriya Vidyalaya: బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్‌లో కెమికల్ పౌడర్ వాసన పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణం కెమికల్ పౌడర్ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులను బాపట్ల ఏరియా హాస్పిటల్‌కి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న వెంటనే హటావుటిన జిల్లా జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన ఎందువల్ల జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాఫీ పొడి, షుగర్‌తో పాటు, సోడియం, ఇతర కెమికల్స్ కలిపిన పౌడర్‌ను, ఓ విద్యార్థి తీసుకువచ్చి సహచర విద్యార్థులకు వాసన చూపించాడని, దీంతోనే విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు.
Read Also: Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు
Also Read
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులు కెమికల్ మిక్స్ చేసిన సమయంలో ప్రమాదకర వాయువుల విడుదలతో విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు ఆయన తెలుసుకున్నారు. ఘటనపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని.. వైద్య సాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!