Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- నిహారిక కొణిదెల సమర్పినలో ‘పాకెట్ రాకెట్స్’ సినిమా
- రుద్ర అత్రి దర్శకత్వం
- త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా.., శ్రియా కొంతం కథానాయికగా.
- జేడీ చక్రవర్తి కీలక పాత్రలో..
- గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామాగా సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocket Rockets: మెగా డాటర్స్ లో ఒకరైన నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో కథానాయకులుగా నటిస్తుండగా.. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే బలమైన కోరిక ఉన్న ఓ సాధారణ యువకుడి చుట్టూ ఈ కథ తిరుగనుంచి. తన కలను నెరవేర్చుకునే క్రమంలో డబ్బు సంపాదించడం కోసం అతను గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన ఊహించని పరిణామాలు, సవాళ్లు ఏమిటనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Also Read
- Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- Sai Pallavi: "రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు".. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్, జేడీ చక్రవర్తిలతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గ్యానీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, విష్ణు వర్దన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
-
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!