NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య.. పోచారం కీలక వ్యాఖ్యలు

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్టు, ఆయనకు బెయిల్ రాకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ వర్ని మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కమ్మవారి ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Also Read: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..

చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలోనే సీనియర్ నాయకులు మాజీ సీఎం చంద్రబాబు అని పోచారం వెల్లడించారు. చంద్రబాబు వ్యక్తిత్వం వ్యక్తిని గౌరవించాలన్నారు. 48, 49 రోజులు అవుతున్నా బెయిల్ రాకుండా చూస్తున్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్ చేశారు. బాన్సువాడలో కమ్మ సోదరులకు కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

Show comments