రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పై రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అతన్ని సమర్థిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం కాదని, కరెంట్ బిల్లులు పెంచోద్దని అసెంబ్లీలో చంద్రబాబును కేసీఆర్ ఉతికి అరేసిండని ఆయన గుర్తు చేశారు.
Also Read : Mopidevi Lord: ఈ దేవాలయానికి ఒక్కసారి వెళితే వెంటనే పెళ్లి జరుగుతుందట..
దేశంలోనే విద్యుత్ సరఫరాలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైన నాటి నుంచి సీఎం కావాలని కలలు కంటున్నారని తెలిపారు. అయన ఆశలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. రేవంత్ పని హైదరాబాద్ చుట్టూ భూ కబ్జాలు చేయడం, దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులు చేయడం ఆయన నైజం అని విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్ రావడం లేదు లాగ్ బుక్ లో చూద్దాం అంటున్నాడు కోమట్ రెడ్డి అని, ఏదో ఒక కారణంతో గంట రెండు గంటలు కరెంట్ పోయి ఉండవచ్చునని ఆయన అన్నారు.
Also Read : Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం.. ప్రసంశల వెల్లువ
గతంలో కంటే కాంగ్రెస్ కు సీట్లు తక్కువ వస్తాయన్నారు. చంద్రబాబు రేవంత్ ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి ఖావడం ఖాయమని, మూడో సారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఉద్ఘాటించారు. సర్వేలు అన్ని కేసీఆర్ అంటున్నాయి స్పీకర్ పోచారం వ్యాఖ్యానించారు.