జీవితంలో బాగా సెటిల్ అయ్యి మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేసుకోవాలని అందరు అనుకుంటారు.. అలా అనుకుంటే సరిపోదు.. మన జాతకం ప్రకారం అన్నీ అనుకూలించాలి.. కొన్ని గ్రహాలు అనుగ్రహించాలి ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.అలానే కొంత మంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది అని పండితులు చెబుతున్నారు… ఆ దేవాలయం గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ దేవాలయం అంత శక్తీవంతమైనదట.. ఈ దేవయానికి వెళ్తే అనుకున్న కోరికలు తీరుతాయి. అలాగే త్వరగా వివాహం అవుతుంది. అలాగే సంతానం కూడా కలుగుతుంది. అదే మోపిదేవి దేవాలయం. ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైనది. ఈ మోపిదేవి దేవాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు.. నిజానికి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ దేవాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఈ దేవాలయానికి వస్తే ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వాళ్ళు ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రజల నమ్మకం..
ఆ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.. ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి శివలింగ ఆకారంలో ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ నుంచి రెండు గంటల ప్రయాణం చేస్తే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. మీ కోరికలను నెరవేరాలన్న శని దోషం దూరమై వివాహం జరగాలన్న కచ్చితంగా ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించాలి.. అయితే ఈ దేవాలయానికి ఎక్కువగా సంతానం లేని వాళ్ళు వస్తుంటారు.. పెళ్లి కానీ వాళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటారు.. నిత్యం వందల మంది ఈ ఆలయం లో దోష నివారణ పూజలు చేస్తుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. మీకు వీలైనప్పుడు వెళితే ఆలయాన్ని సందర్శించండి..