ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు, ఒకర్ని విమర్శించే వ్యక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ దాడి సరీకాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా కాంగ్రెస్ చేస్తుందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎలాంటి మత కల్లోలాలు,దాడులు,జరగకుండా పాలించారని, కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు,బాంబుల రాజకీయం తేవాలని చూస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రములో ముఖ్యమంత్రుల మార్చే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ నయీమ్ లాంటి దేశ ద్రోహులను కట్టడి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరుకొక నయీమ్ తయారవుతాడు. కాంగ్రెస్ వస్తె భూఖబ్జాలు,గూడాయిజం పెరుగుతుంది. కేసీఆర్ ములుగు జిల్లాకి మెడికల్ కాలేజీ,ఎటూరునాగారం రెవెన్యూ డివిజన్,మల్లంపల్లి మండలం ఇచ్చారు. సీతక్క తనను ఓడించడానికి మంత్రులు వస్తున్నారని మాటలు చెపుతున్నారు. ఛత్తీస్ ఘడ్ నుండి సంచులు తెప్పించుకున్నది మీరు,సంచులతో కొనేది మీరు. 90 కోట్ల రూపాయలు ఒక ప్రయివేట్ హోట్లల్లో పెట్టి,నర్సంపేట,భూపాలపల్లి,పరకాల నియోజకవర్గాలకు పంచింది మీరు.
ఒక్క ఎంపీపీ కి 20 లక్షలు,సర్పంచ్ కి 10 లక్షలు,వార్డు మెంబర్ కి 1లక్ష రూపాయలు ఇచ్చి కొంటున్నది మీరు. న్యాయంగా ఓటు అడగాలే కానీ,సంచులతో కొనడం మీకు అలవాటు. 50 కోట్లు ములుగు జిల్లాకు తెప్పించుకుని,సంతలో సరుకులలాగా ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలను కొంటున్నది మీరు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెరిరింపులకు గురిచేయడం సీతక్కకు సరికాదు. కెమెరాలకు ఫొటోస్ కి పోజులు ఇచ్చింది మీరు..ప్రజా సేవా, అభివృద్ధి చేసింది మేము. సీతక్క తెరాస నాయకులకు నేను గెలుస్తా నని చెప్పి,ఎవరూ అధికారం లోకి వచ్చినా నేను అందులో వుంటా అని ఇతర పార్టీ కార్యకర్తలని మభ్య మభ్య పెడుతున్నారు. మనం చేసిన పనిని బట్టి ఓటు అడగడం మంచడాన్నారు. కేసీఆర్ వుంటేనే అభివృద్ది,శాంతి భద్రతలు ఉంటాయన్నారు.’ అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.