PM Modi: నేడు బీహార్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, నవాడా జనసభలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే, బీహార్‌లో వారం రోజుల వ్యవధిలో రెండవ సారి ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి NDA తరపున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించారు. ఇక, నవాడాలో ప్రధాని మోడీ కార్యక్రమం దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో పాటు నవాడా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
Read Also: Pawan Kalyan: నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..
Also Read
అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గిరిరాజ్ సింగ్‌కు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. ప్రధాని పర్యటనపై బీజేపీ కార్యకర్తల ఉత్సాహంగా ఉన్నారు. మోడీ రెండోసారి నవాడాకు రానుండటంతో పాటు శ్రీరామ నవమికి ముందు మోడీ నవాడ నుంచి ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మగాడికి అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి మోడీ ప్రజలకు వివరంగా చెప్పనున్నారు.
ఎన్టీయే కూటమి తరపున ప్రధాన మంత్రి బహిరంగ సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్ఎల్ఎంఓ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ, హెచ్ఏఎం జాతీయ అధ్యక్షుడు సంతోష్ మాంఝీ, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తదితరులు ప్రసంగించనున్నారు. వేదికపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!