Site icon NTV Telugu

PM Modi: నేడు బీహార్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ..

Modi

Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, నవాడా జనసభలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే, బీహార్‌లో వారం రోజుల వ్యవధిలో రెండవ సారి ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి NDA తరపున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించారు. ఇక, నవాడాలో ప్రధాని మోడీ కార్యక్రమం దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో పాటు నవాడా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.

Read Also: Pawan Kalyan: నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..

అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గిరిరాజ్ సింగ్‌కు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. ప్రధాని పర్యటనపై బీజేపీ కార్యకర్తల ఉత్సాహంగా ఉన్నారు. మోడీ రెండోసారి నవాడాకు రానుండటంతో పాటు శ్రీరామ నవమికి ​​ముందు మోడీ నవాడ నుంచి ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మగాడికి అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి మోడీ ప్రజలకు వివరంగా చెప్పనున్నారు.
ఎన్టీయే కూటమి తరపున ప్రధాన మంత్రి బహిరంగ సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎంఓ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ, హెచ్‌ఏఎం జాతీయ అధ్యక్షుడు సంతోష్ మాంఝీ, ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తదితరులు ప్రసంగించనున్నారు. వేదికపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా పాల్గొననున్నారు.

Exit mobile version