Site icon NTV Telugu

I.N.D.I.A Alliance: మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది..

India Alliance

India Alliance

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.

Bombay High Court: ఉద్ధవ్ ఠాక్రేకి మళ్లీ షాక్.. ఏక్‌నాథ్ షిండే గ్రూపు పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు జారీ

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు సీనియర్ ప్రతిపక్ష నేతలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే వారెవరూ అయోధ్యకు వెళ్లమని ప్రకటించారు. ‘ప్రాణ్‌ ప్రతిష్ఠ’ కార్యక్రమంపై ఇండియా కూటమి సమావేశంలో చర్చించారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. మతం వ్యక్తిగత విషయం అని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించింది.

Minister Kakani Govardhan Reddy: మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయం

కాగా.. మంగళవారం ఎంపీ రాహుల్ గాంధీ ఈ వేడుకను ‘నరేంద్ర మోదీ వేడుక’గా అభివర్ణించారు. మరోవైపు.. మమతా బెనర్జీ కూడా విమర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు. నిర్మాణంలో ఉన్న రామమందిరం సహాయంతో బీజేపీ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేస్తోందని ఆరోపించారు. ‘ప్రాణ ప్రతిష్ఠ’ లేదా రామమందిరాన్ని పూర్తిగా విస్మరించలేమని ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు. వారు ఇలా చేస్తే, చాలా మంది ఓటర్లు వారికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కూటమి చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే జనవరి 22న కాంగ్రెస్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు తమ సొంత కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

Exit mobile version