అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
2024 జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ఠ" విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి 'అయోధ్య దర్శన్' పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.