Site icon NTV Telugu

PM Modi: అధంపుర్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోడీ.. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంస

Modi2

Modi2

నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు. పాకిస్తాన్ భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే.. తమ దాడిలో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పేల్చివేశామని చెప్పిన విషయం తెలిసిందే.

Also Read:Alia Bhatt : ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది..

కానీ ప్రధానమంత్రి విమానం ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత, పాకిస్తాన్ వాదన పూర్తిగా అబద్ధమని రుజువైంది. ఎందుకంటే భారతదేశంలోని అత్యంత VVIP విమానం ఈ ఎయిర్‌బేస్‌లో విజయవంతంగా ల్యాండ్ అయింది. భారతదేశ యుద్ధ విమానం మిగ్ 29 కి అదంపూర్ ఎయిర్‌బేస్ స్థావరం. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరం, శత్రువులపై మెరుపు దాడికి ప్రసిద్ధి చెందింది.

Also Read:Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!

ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఈ ఉదయం నేను AFS ఆదంపూర్‌ను సందర్శించి, మా ధైర్య వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతకు చిహ్నాలుగా ఉన్న వ్యక్తులతో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది” అని రాసుకొచ్చారు.

Exit mobile version