ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలకు వెల్లడించాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. రైల్వే శాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖకు మోడీ పర్యటనపై ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ కొత్త సర్వీసు ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం కానుంది.
Also Read : Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..
ఈ వందేభారత్ నూతన సర్వీసు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడవనుంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రయిల్ రన్ ఇప్పటికే పూర్తి చేశారు రైల్వే అధికారులు. ఇందుకోసం అందుబాటులో ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్‌ను ఖరారు చేయాలనే దానిపైనా అధ్యయనం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా 6 నుంచి 7 గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటుండటంతో వందే భారత్‌ట్రైన్‌పైనే ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.
Also Read : Shooting At Gurudwara: అమెరికాలోని గురుద్వారాలో ఫైరింగ్ .. సిక్కుల మధ్య ముష్టియుద్ధం