Modi foreign visit schedule: ఆగస్టు 29 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. ఏయే దేశాలకు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi foreign visit schedule: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29 – 30 తేదీలలో జరగనున్న 15వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లడం దీంతో కలిపి 8వ సారి, ఆ దేశ ప్రధానమంత్రి ఇషిబాతో ఇది మోడీకి మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది. దీని తర్వాత ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా పర్యటనలో ఉంటారు.
READ ALSO: Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్‌షా తీవ్ర ఆరోపణలు..
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
వ్యూహాత్మక సమావేశం..
జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంపై సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంశాలు చర్చకురానున్నాయి. దీనితో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 ఏళ్ల తర్వాత చైనా పర్యాటనకు వెళ్తున్నారు. 2018 వ సంవత్సరం ప్రారంభంలో కింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధాని మోడీ చైనా వెళ్లారు. తర్వాత మళ్లీ ఆయన ఇప్పుడే ఆ దేశానికి వెళ్తున్నారు. ప్రస్తుతం భారతదేశం – చైనా రెండూ పరస్పరం సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి మోడీ ఆగస్టు 31 నుంసీ సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి టియాంజిన్ చేరుకుంటారు. ఈ సమయంలో ఆయన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అనేక మంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. షాంఘై సహకార సంస్థ టియాంజిన్ సమ్మిట్-2025 అనేది 25వ దేశాధినేతల మండలి సమావేశం. ఇది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 , వరకు చైనాలోని టియాంజిన్‌లో జరుగనుంది. చైనా వార్షిక షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌ను నిర్వహించడం ఇది ఐదవసారి.
READ ALSO: Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్
తాజావార్తలు
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!