Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Vikram DV4: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా మొదట ప్రకటించిన ‘DV4’ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద వివాదమే నడుస్తోంది. దర్శకుడు రమేష్ వర్మతో చేయాల్సిన సినిమా పెండింగ్‌లో ఉండగానే ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ‘DV4’ పేరుతో ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లడంతో అసలు రమేష్ వర్మ సినిమా పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌పై నిర్మాతల నుంచి వచ్చిన కొత్త ప్రకటన మరోసారి ఆసక్తిని పెంచుతోంది.
శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ తాజాగా ధృవ్ విక్రమ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘DV4’ను తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. పెన్ మూవీస్, ఆర్వీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని జయంతిలాల్ గాడా సమర్పిస్తున్నారు. ధృవ్ విక్రమ్ యూత్‌ఫుల్ ఎనర్జీకి, రమేష్ వర్మ కమర్షియల్ మేకింగ్ స్టైల్‌కు కలయికగా ఈ సినిమాను భారీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో సినిమాను రూపొందించనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ధృవ్ విక్రమ్‌కు సరిపోయే పాత్రను రమేష్ వర్మ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండగా, ఇప్పుడు అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించేశారు.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
అయితే ఈ ప్రకటన వెనుక గతంలో జరిగిన వివాదం మాత్రం ప్రస్తావించకుండా ఉండలేం. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ సినిమాకే ముందుగా ధృవ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా ‘DV4’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ధృవ్ విక్రమ్ డెబ్యూ దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమాను ‘DV4’ పేరుతోనే ప్రకటించారు. జూలైలో ప్రారంభమైన ఈ సినిమాను మేకర్స్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా పేర్కొన్నారు. దీంతో ముందుగా రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రకటించిన ప్రాజెక్ట్ కు ధృవ్ దూరం జరుగుతున్నారని, దీంతో వర్కింగ్ టైటిల్ మీద నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకే నటుడి రెండు సినిమాలకు ఒకే వర్కింగ్ టైటిల్ రావడంతో వివాదం మరింత పెద్దదైంది.
ఈ వ్యవహారం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు కూడా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ధృవ్ విక్రమ్ ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ను పూర్తి చేయాలని, అప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్లకుండా ఉండాలని SIFCC సూచించినట్లు గతంలో రిపోర్టులు వచ్చాయి. కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వివాదం పరిష్కారమయ్యే వరకు నిలిపివేయాలని ఛాంబర్ సూచించినట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీలాద్రి ప్రొడక్షన్స్ నుంచి రమేష్ వర్మ, ధృవ్ విక్రమ్ కాంబినేషన్లో ‘DV4’ను మళ్లీ అధికారికంగా ప్రకటించడం ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పడం చూస్తే ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన SIFCC వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే అనిపిస్తోంది. నటుడు విక్రమ్ స్వయంగా జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చడంతో, ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ఫిర్యాదును ఉపసంహరించుకుని నిన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా రీ-లాంచ్ చేశారు. ఈ వివాద పరిష్కారానికి అనుగుణంగానే మైత్రీ మూవీస్ సంస్థ కూడా తమ చిత్ర షెడ్యూల్స్‌ను మార్చుకోగా, ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా 2026 సెప్టెంబర్ 23న ఈ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
- Tags
- cinema
- Dhruv Vikram
తాజావార్తలు
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!