Site icon NTV Telugu

Narendra Modi: వాటికి ముడిపెట్టొద్దు.. మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన

Whatsapp Image 2022 11 19 At 12.33.54 Pm

Whatsapp Image 2022 11 19 At 12.33.54 Pm

Narendra Modi: భారత ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం హైడ్రో పవర్ స్టేషన్ ను జాతికి అంకితమిచ్చారు. ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గమైన వారణాసికి వెళతారు. అక్కడ ఓ సాంస్కృతిక కార్యక్రమ ప్రారంభంలో పాల్గొంటారు. నెల రోజుల పాటు సాగే కాశీ ‘తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వచ్చే నెల ఎన్నికలు జరిగే స్వరాష్ట్రం గుజరాత్ కు వెళతారు.

Read Also: ChandraBabu: ‘ఇదేం కర్మ’ అంటున్న చంద్రబాబు

ఇటానగర్ సమీపంలోని డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రధాని 9.30గంటలకు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచడంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా ‘డోనీ పోలో ఎయిర్‌పోర్ట్, ఇటానగర్’ నిలవనుందన్నారు. ఎన్నికల కోసం పునాది రాయి వేస్తున్నారంటూ ఆరోపించిన వారి ముఖంపై, తాజా ప్రారంభోత్సవం చెంప దెబ్బ వంటిదన్నారు. అరుణాచల్ లో 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో విద్యుత్ పరంగా అరుణాచల్ మిగులు రాష్ట్రంగా మారింది. అభివృద్ధిని రాజకీయాలకు, ఎన్నికలకు ముడి పెట్టి చూడొద్దని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను కోరారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో దీన్ని ఎన్నికల ఎత్తుగడగా ప్రతిపక్షాలు విమర్శించాయి. అరుణాచల్ లో 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో విద్యుత్ పరంగా అరుణాచల్ మిగులు రాష్ట్రంగా మారింది.

Exit mobile version