NTV Telugu Site icon

PM Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..

Palamuru Praja Garjana Sabha

Palamuru Praja Garjana Sabha

PM Modi Speech at Palamuru Praja Garjana Sabha: పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని.. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానన్న ప్రధాని మోడీ.. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Also Read: Kishan Reddy: సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోంది..

నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారని మోడీ పేర్కొన్నారు. మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని.. అబద్దాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్ర స్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని మోడీ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో తొలుత అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్‌టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు.

Also Read: PM Modi: పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?

ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. రాణి రుద్రమలాంటి వీరనారీమణులు పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ అంటూ కీర్తించారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. మహిళలు ఇల్లు కట్టుకుంటే కేంద్రం పీఏంఏవై నిధులు ఇస్తోందని ప్రధాని వివరించారు. రాష్ట్రంలో 2014 వరకు కేవలం 2500 కి.మీ మేర మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి… గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమా చేశామన్నారు. ఇక్కడి ప్రభుత్వం రైతుల పేరుతో ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాల జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరు మీద ఆర్భాటాలు, హంగామాలు జరుగుతాయి కానీ రైతులకు నీళ్ళు ఇవ్వరు అంటూ ప్రధాని ఆరోపణలు చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందరో రైతుల మరణానికి కారణం అయ్యారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ భూమి ఇవ్వడం కోసం ఇక్కడి అవినీతి సర్కారు 5 ఏళ్ళ సమయం తీసుకుందన్నారు ప్రధాని మోడీ. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పట్ల తెలంగాణ సర్కారుకు ఆసక్తి లేదన్నారు. ఆదివాసుల, గిరిజనుల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రేమ లేదని ఆయన విమర్శలు గుప్పించారు.