Narendra Modi: నరేంద్ర మోదీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన పీఎం..
- చరిత్ర స్పష్టించిన పీఎం నరేంద్ర మోదీ..
- అత్యధిక కాలం పనిచేసిన నాయకుడిగా రికార్డ్..
- ప్రశంసల వర్షం కురిపించిన మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ఒక ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా కలిపి ఆయన ఇప్పటివరకు 8,931 రోజులు పదవిలో కొనసాగి చరిత్ర పుటల్లో నిలిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు.
కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాశారు.. ‘దేశం పట్ల, ప్రజల పట్ల ఉన్న అపారమైన భక్తికి మోదీ నిదర్శనం. ఆయన జీవితం నిరంతర సేవా ప్రయాణం. దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆయన సాగిస్తున్న పాలన ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకం’ అన్నారు.
Also Read
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సోషల్ మీడియా ఖాతాల్లో మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ‘గడిచిన 24 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం శ్రమించడం మోదీకి మాత్రమే సాధ్యమైంది. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో కొత్త రికార్డులు సృష్టించడం ద్వారా ఆయన ‘మోదీ యుగాన్ని’ సృష్టించారు. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతూనే ఉందన్నారు.
జేపీ నడ్డా (ఆరోగ్య మంత్రి).. ‘మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు ‘వికసిత భారత్’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మహిళలు, రైతులు, యువత, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. ప్రపంచ వేదికపై నేడు భారత్ ఎంతో శక్తివంతంగా నిలిచింది’.
Also Read:Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
అశ్విని వైష్ణవ్ (రైల్వే మంత్రి).. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెనపై జాతీయ జెండా పట్టుకున్న ప్రధాని ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఆయన ప్రతి క్షణం దేశ ప్రజల కోసమే’అని కొనియాడారు.
పియూష్ గోయల్ , కిరణ్ రిజిజు.. మోదీ ప్రయాణం కష్టపడే తత్వానికి, నిజాయితీకి నిదర్శనమని, ఇది దేశాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ అక్టోబర్ 2001 నుంచి మే 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం సేవలు అందించారు. ఆ తర్వాత 2014, 2019 , 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి.. మూడుసార్లు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలు ఆయనపై ఉంచిన అచంచలమైన విశ్వాసమే ఈ సుదీర్ఘ ప్రయాణానికి పునాది అని బీజేపీ నేతలు అభివర్ణించారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!