PM Modi on Ratan Tata: ప్రధాని నరేంద్ర మోడీ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మనతో ఉండి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు. సోమవారం గుజరాత్‌లోని వడోదరలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటాను గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. ఇటీవల మనం దేశం గొప్ప కుమారుడు రతన్ టాటా జీని కోల్పోయామని ఆయన అన్నారు. ఈరోజు ఆయన మనమధ్య ఉంటే చాలా సంతోషంగా ఉండేవారు. కానీ, ఆయన ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం కచ్చితంగా ఆనందంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ C-295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కొత్త భారతదేశపు కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Nandyal Crime: పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడోదరలో రైలు కోచ్‌ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఫ్యాక్టరీని కూడా రికార్డు సమయంలో ఉత్పత్తికి సిద్ధం చేసి, నేడు ఆ ఫ్యాక్టరీలో తయారైన మెట్రో కోచ్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కర్మాగారంలో తయారైన విమానాలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉందని విశ్వాసం వ్యక్తం చేసారు.
Read Also: Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..
ఈ సందర్బంగా 56 విమానాలను తయారు చేసేందుకు స్పెయిన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొదటి 16 విమానాలను స్పెయిన్‌లో నిర్మించనున్నారు. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ మిలిటరీకి సంబంధించిన విమానాలను తయారు చేయనుంది. మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసే దేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ అసెంబ్లీ లైన్ ఇదే. భారత వైమానిక దళానికి రవాణా విమానాలు చాలా ముఖ్యమైనవి. తద్వారా సైనికులు, ఆయుధాలు, ఇంధనం, హార్డ్‌వేర్‌లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయవచ్చు. ఇందులో సి-295 తక్కువ బరువు రవాణాకు తోడ్పడనుంది.