NTV Telugu Site icon

PM Modi: చైనాతో సంబంధాలపై మోడీ కీలక వ్యాఖ్యలు

Modi

Modi

సార్వత్రిక ఎన్నికల వేళ చైనాతో సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు భారత్‌‌కే కాదు.. ప్రపంచానికీ కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక చర్చల్లో భారత్-చైనా సరిహద్దు పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. రెండు దేశాల మధ్య బంధం ఉందని మోడీ చెప్పుకొచ్చారు. చైనాతో మాకే కాదు.. ప్రపంచానికి సంబంధాలు ముఖ్యమేనని పేర్కొన్నారు. సానుకూల చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరిస్తామని ప్రధాని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Summer Tips : వేసవిలో ఈ పానీయాలను తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

భారత్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా ఎదుగుతున్న తీరు.. భారత్‌ను ఓ వర్ధమాన సూపర్‌ పవర్‌గా నిలబెడుతోందని ప్రధాని వివరించారు. సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలన్నారు. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Eid Ul Fitr 2024: దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఈద్‌ శుభాకాంక్షలు

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లతో ఏర్పడిన క్వాడ్‌ కూటమి.. ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ క్లారిటీ ఇచ్చారు. రామ మందిర ప్రారంభం గురించి మాట్లాడుతూ.. రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. తమ ప్రభుత్వం… ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్పారు. ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందన్నారు. కానీ భారత్‌ మాత్రం ఇందుకు మినహాయింపు ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అనూహ్యంగా మద్దతు పెరిగిందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Ramzan 2024: మేమంతా సిద్ధం యాత్రకు మళ్లీ బ్రేక్‌.. రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం..

2020లో లడఖ్‌లో చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. ఈ ఘర్షణల్లో అప్పట్లో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. అప్పటినుంచి ఘర్షణ వాతావరణమే చోటుచేసుకుంది. అనంతరం 2019 ఎన్నికల సమయంలో పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాకిస్థానే కారణమని అప్పట్లో ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ ఘటన తర్వాత పాక్-భారత్ మధ్య కూడా సంబంధాలు క్షీణించాయి.

పాకిస్థాన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కి అభినందనలు తెలిపినట్లు ప్రధాని మోడీ ఇంటర్వ్యూలు గుర్తుచేశారు. తాము శాంతి, భద్రత, ప్రజల శ్రేయస్సును కోరుకుంటున్నామని తెలిపారు. ఇక ఇమ్రాన్‌ఖాన్ జైలు శిక్షపై స్పందించడానికి మోడీ నిరాకరించారు. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Shubman Gill Record: శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు!