వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. ఎండకు బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.. వేడికి శరీరం డీహైడ్రెడ్ కు గురవుతుంది.. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పానీయాలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఆ పానీయాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బయట దొరికే వాటితో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. అందుకే వీటిని ఇంట్లోనే తయారు చేసుకొని తాగితే చాలా మంచిది.. అవేంటంటే..
సమ్మర్‌లో తరచుగా మంచి నీళ్లను తాగాలి. దీంతో పాటు ఈ కాలంలో కొబ్బరి నీళ్లు తాగటం మంచిది. ఇందులోని మినరల్స్, ఎలక్ర్టోలైట్స్ వల్ల జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.. కొబ్బరినీళ్లను తాగడం వల్ల రక్తంలో పీహెచ్ లెవల్ తగ్గిపోకుండా ఉంటాయి.. కొంతమంది గ్లూకోజ్ ను వేసుకొని కూడా తాగుతారు..
అరటిపండును తినటం వల్ల ఎండాకాలంలో పొట్టకు సంబంధించిన సమస్యలనుంచి బయటపడవచ్చు.. ఎందుకంటే ఈ పండ్లలో పోటాషియం, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి..
అలాగే జీలకర్ర పొడిని వేడి నీటిలో వేసుకొని తాగిన కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి… ధనియాలను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగితే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ సమ్మర్ లో మజ్జిగలో నిమ్మరసం లేదా జీరా పొడి వేసుకొని తాగిన జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.