Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాజీ రాజకీయ వేత్త అయిన జోసెఫ్ గోబెల్స్‌ను మోడీ స్ఫూర్తిగా తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ (సోమవారం) ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. మీకు ఒక అబద్దాన్ని చెప్పి దానిని పదే పదే పునరావృతం చేయడం ద్వారా చివరికి ప్రజలు దానినే నమ్ముతారని గోబెల్స్ వ్యాఖ్యానించేవారని ఆయన చెప్పారు. కాబట్టి, రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోడీ ఖచ్చితంగా గోబెల్స్ ప్రచార విలువను చదివి ఆయన నుంచి స్ఫూర్తి పొందే ఉంటాడని విమర్శించారు. అందుకే దేశం మొత్తం తిరిగి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జైరాం రామేశ్ చెప్పుకొచ్చారు.
Read Also: Twitter Down: నిలిచిపోయిన ట్విట్టర్.. ఐదు రోజుల్లో ఇది రెండో సారి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కాగా, ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మోడీ ఓ మాజీ ప్రధానిపై, కాంగ్రెస్ న్యాయ పత్రమై సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పారని జైరాం రమేశ్ వెల్లడించారు. అసత్యమేవ జయతే అనేది ఎల్లప్పుడూ ప్రధాని మోడీ నినాదం అని ఆరోపలు చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలే దీన్ని పదేపదే రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. మోడీ మాట్లాడిన ప్రతిసారీ సత్యం కనుమరుగైపోతుందని వెల్లడించారు. కానీ, నరేంద్ర మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
For his MA in Entire Political Science, Mr. Narendra Modi must definitely have read Joseph Goebbels on the value of propaganda and taken inspiration from him.
Goebbels is reputed to have said: "If you tell a lie big enough and keep repeating it, people will eventually come to…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!