PMO Driver Salary : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది ప్రజలు తరచుగా ఆయన గురించి తెలుసుకోడానికి ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతున్నారు. వీరిలో కొందరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తే, మరికొందరు ఆయన జీతం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపించారు. అలాగే ఆయన డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది, వంట వారికి నెలకు ఎంత లెక్క ముడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP లైకా కెమెరాతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర ఎంతంటే..?
డ్రైవర్ జీతం ..
ప్రధానమంత్రి వద్ద పనిచేసే డ్రైవర్లు పే లెవల్ 5 కింద రూ.29,200 నుంచి రూ.92,300 వరకు ఉంటాయి. ఈ జీతానికి సంబంధించిన డేటాను PMO 2023 వరకు విడుదల చేసింది. ఈ డేటాలో రూ.44,100 నుంచి ₹42,800 వరకు ప్రాథమిక జీతం, పెన్షన్ మొత్తాన్ని చూపిస్తుంది. ఆ టైంలో PMO నలుగురు డ్రైవర్లను నియమించింది. ఇప్పుడు ఈ సంఖ్య మారింది. నిజానికి PMO కోసం పనిచేసే డ్రైవర్లు మాత్రమే PM మోడీ కారు నడపడానికి అర్హులు. వారు ప్రధాని కారు నడపడానికి ముందు వివిధ పరీక్షలలో విజయవంతం కావాల్సి ఉంది. అత్యంత చురుకైన, నైపుణ్యం కలిగిన డ్రైవర్లకు మాత్రమే ఈ ఉద్యోగం ఇస్తారు.
వంటవాడికి జీతం ఎంతంటే..
నిజానికి PMO లో పనిచేసే వంటవాళ్లు కూడా మంచి జీతం పొందుతారు. 2023 లో డేటా ప్రకారం.. పే లెవల్ 1 లో పనిచేసే వంటవాళ్లు రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు జీతాలు పొందారు. వంటవాడికి ప్రాథమిక జీతం రూ.20,300. అదేవిధంగా PM మోడీతో పనిచేసే ఇతర ఉద్యోగులు వారి ప్రభుత్వ ఉద్యోగం ఆధారంగా వివిధ భత్యాలను పొందుతారు.
READ ALSO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGSRTC లో 198 పోస్టులకు నోటిఫికేషన్