Site icon NTV Telugu

India Women’s Cricket: శెభాష్ అమ్మాయిలూ.. మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు!

India Women’s Cricket

India Women’s Cricket

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట స్ఫూర్తి అభినందనీయం అని ఆయన అన్నారు.

Also Read: CWC 2025: దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డులు!

విజయం సాధించిన ఆటగాళ్లందరికీ నరేంద్ర తన శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం ఒక కప్ గెలవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో యువతరం క్రీడలను స్వీకరించడానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. దేశానికి కీర్తిని తీసుకురావడానికి రాబోయే ఛాంపియన్‌లను ఇది ప్రేరేపిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఈ గెలుపు భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది.

Exit mobile version