India Women’s Cricket: శెభాష్ అమ్మాయిలూ.. మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు!
- భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
- మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు
- రాబోయే ఛాంపియన్‌లను ఇది ప్రేరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట స్ఫూర్తి అభినందనీయం అని ఆయన అన్నారు.
Also Read: CWC 2025: దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డులు!
Also Read
విజయం సాధించిన ఆటగాళ్లందరికీ నరేంద్ర తన శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం ఒక కప్ గెలవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో యువతరం క్రీడలను స్వీకరించడానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. దేశానికి కీర్తిని తీసుకురావడానికి రాబోయే ఛాంపియన్‌లను ఇది ప్రేరేపిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఈ గెలుపు భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…
— Narendra Modi (@narendramodi) November 2, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!