Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!