Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి ఢాకా ఆహ్వానం..?

Modi

Modi

PM Modi: రెండేళ్ల అనిశ్చితి తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. దివంగత మా ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు బంగ్లాను పాలించిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారానికి తెరపడనుంది.

Read Also: 3 in 1 Electric Car: ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన 3-ఇన్-1 ఎలక్ట్రిక్ కారు.. స్మార్ట్ వాచ్ తో కంట్రోల్ చేయొచ్చు!

ఇదిలా ఉంటే, యూనస్ సమయంలో భారత బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూనస్ పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వారిలో సంబంధాలను పెంచుకున్నాడు. భారత వ్యతిరేకత, హిందువులపై వ్యతిరేకతను నూరిపోయడంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, వీటన్నింటిని పక్కన పెట్టి, ప్రధాని నరేంద్రమోడీని ఢాకాకు ఆహ్వానించాలని బీఎన్పీ అనుకుంటోంది. తారిక్ రెహ్మాన్ ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్రమోడీని ఆహ్వానించాలని యోచిస్తోంది. ప్రాంతీయ దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రధాని మోడీ కీలక ఆహ్వానితుల్లో ఉంటరని భావిస్తున్నారు.

ప్రధాని మోడీ, బంగ్లాకు కాబోతున్న ప్రధాని తారిఖ్ రెహ్మాన్‌తో మాట్లాడిన తర్వాత, ఈ పరిణామం చోటుచేసుకుంది. తారిక్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక వేళ ఆహ్వానం అంది, ప్రధాని మోడీ ఢాకా వెళ్తే, భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార తేదీని ఇంకా ధ్రువీకరించడకపోవడంతో, విదేశీ నాయకుల హాజరును నిర్ధారించలేదు.

Exit mobile version