NTV Telugu Site icon

PM Modi: నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారం..

Modi

Modi

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు.

Read Also: Bangladesh MP Murder: సెప్టిప్ ట్యాంకులో బంగ్లాదేశ్ ఎంపీ మాంసం.. ఫోరెన్సిక్ విచారణ..

ఇక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బరిపాడలోని ఛౌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు బాలాసోర్‌లో.. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రపరాలో జరిగే బహిరంగ సభల్లో మోడీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖుషీనగర్‌, డియోరియా, గోరఖ్‌పూర్‌లో ప్రచారం చేయనున్నారు.

Read Also: Supreme Court: సుప్రీం కోర్టు కూల్చొద్దు.. పిటిషన్‌లో ఇంకేముందంటే..!

అయితే, నేటి ఉదయం 11:30 గంటలకు ఖుషీనగర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు డియోరియాకు చెందిన బాబా రాఘవదాస్ ఇంటర్ కళాశాలలోని భట్‌పరాని మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక, చివరగా మధ్యాహ్నం 1:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని మురారీ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు గోరఖ్‌పూర్‌లోని బన్స్‌గావ్‌లోని సర్వోదయ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేస్తున్నారు.

Show comments