PM Internship Scheme: ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు
- 'పీఎం ఇంటర్న్‌షిప్' పథకం నేటి నుంచి ప్రారంభం
- ఇందుకోసం పోర్టల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Internship Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే 5 సంవత్సరాలలో, దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇవ్వబడతాయి. ఇంటర్న్‌షిప్ అలవెన్స్ ప్రతి నెలా రూ.5,000.. ఏకమొత్తంలో రూ.6,000 ఇవ్వబడుతుంది. ఉపాధి అవకాశాల కోసం 12 నెలల అనుభవం అందుబాటులో ఉంటుంది. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండ్ నుండి శిక్షణ ఖర్చు, ఇంటర్న్‌షిప్ ఖర్చులో 10 శాతం భరిస్తాయి.
‘అమృత్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
10 వేల కోట్లతో పరిశుభ్రతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో మిషన్ అమృత్, అమృత్ 2.0 కూడా ఉన్నాయి. దీని కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also: Kangana Ranaut: మళ్లీ నోరుజారిన కంగన.. గాంధీ జయంతి నాడు చేసిన పోస్ట్‌పై వివాదం
స్వచ్ఛ భారత్ మిషన్‌పై ప్రధాని మోడీ
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కోట్లాది మంది దేశప్రజల అచంచలమైన నిబద్ధతకు స్వచ్ఛ్ భారత్ మిషన్ యాత్ర ప్రతీక అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన సామూహిక ఉద్యమంగా అభివర్ణిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రయాణంలో ప్రతి ప్రయత్నం ‘పరిశుభ్రత శ్రేయస్సు’ మంత్రాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. గత పదేళ్లుగా, భారతీయులు ఈ మిషన్‌ను స్వీకరించారని, తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారన్నారు. పదేళ్ల ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన ప్రతి ఒక్కరిని, సఫాయి మిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహచరులను ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి కృషి స్వచ్ఛ భారత్ మిషన్‌ను భారీ ప్రజా ఉద్యమంగా మార్చిందని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి కూడా పరిశుభ్రత సేవలో తమ వంతు సహకారం అందించారని, దేశానికి గొప్ప స్ఫూర్తిని అందించారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కూడా సర్క్యులర్ ఎకానమీకి కొత్త ఊపునిచ్చింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..