Site icon NTV Telugu

Actors Fight: బంగ్లాదేశ్లో సినీ క్రికెట్ లీగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్న నటులు

Bccl

Bccl

క్రికెట్లో గొడవలు జరగడం కామనే. అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం వరకు వెళ్తుంటాయి. అలాంటి సందర్బాల్లో అంపైర్లు కానీ, తోటి ఆటగాళ్లు కానీ వచ్చి గొడవను సద్దుమణిగిస్తారు. కానీ ఇక్కడ జరిగిన ఘటనలో ఒకరికొకరు తన్నుకోవడం, గుద్దుకోవడం లాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Read Also: Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే బెంచ్ ఖరారు..!

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ టీమ్ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై చిత్ర నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రెండు జట్లలోని కొంతమంది ఆటగాళ్ళు, ఇతర వ్యక్తులు వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కొంతమంది బ్యాట్‌లతో దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రాజ్ రిపా.. మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారని సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. బంతి బౌండరీ దాటి వెళ్లడాన్ని యాజమాన్యం అంగీకరించలేదు. కమల్ రాజ్ జట్టులోని ఆటగాళ్లు మద్యం తాగి ఉన్నారని.. వారిపై వాటర్ బాటిళ్లు కూడా విసిరారని రాజ్ రిపా చెప్పారు.

Exit mobile version