భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్‌లో సునీత టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇక, దాడి చేసిన వ్యక్తిని శ్రీకర్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గతంలో ఉద్యోగం కోసం శ్రీకర్ 30, 000 రూపాయలు చెల్లించినట్లు చెబుతున్నాడు.. అయితే, డబ్బులు తీసుకున్న మహిళను శ్రీకర్ గుర్తు పట్టకపోవడంతో పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్య సునీతని చూసి డబ్బులు తీసుకున్న మహిళ ఇమేనే అనుకుని శ్రీకర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే, శ్రీకర్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని పోలీసులు వెల్లడించారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీకర్ పై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు