పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్‌లో సునీత టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు.