NTV Telugu Site icon

AP MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్య?

Peela Govinda Satyanarayana

Peela Govinda Satyanarayana

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. తాజాగా రాజ‌కీయ పార్టీల‌కు మళ్లీ ప‌రీక్ష మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాద‌వ్ వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ప‌ద‌వికీ రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న రాజీనామాను అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే శాస‌న‌మండ‌లి ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూట‌మి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల‌ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త‌మ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవ‌డానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా ర‌చ‌న చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్పటికే ఉత్తరాంధ్రాలో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి బొత్స స‌త్యన్నారాయ‌ణను అభ్యర్థిగా ప్రక‌టించింది.

READ MORE: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్యను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. నారాయణ పేరు దాదాపు ఖరారు చేశారు. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. పీలా గోవింద సత్య 2014-19 మధ్య అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో పోటీకి అవకాశం లభించలేదు. కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పజెప్పింది కూటమి ప్రభుత్వం. అచ్చన్నాయుడు, అనిత, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే వైసీపీ తరపున మాజీ మంత్రి కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఎన్నికల బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.