PI Meena : ఓటీటీ లోకి రాబోతున్న సరికొత్త క్రైమ్ డిటెక్టివ్ థ్రిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా స్ట్రీమింగ్ కానుంది.. ఇందులో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాలోయ్ భట్టచార్య దర్శకత్వం వహించగా.. అరిందమ్ మిత్ర నిర్మాత గా వ్యవహరించారు.అనుమానాస్పద సంఘటనల వెనుక ఉన్న మిస్టరీనీ ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన మీనా పాత్ర చుట్టూ ఈ సిరీస్ ఉంటుందని సమాచారం. ఎన్నెన్నో ట్విస్ట్ లతో నిండి ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 3 వ తేది నుంచి పీఐ మీనా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
పీఐ మీనా వెబ్ సిరీస్ గురించి డైరెక్టర్ దేబాలోయ్ భట్టచార్య ఆసక్తికర విషయాలు తెలిపారు. “నాకు ఎప్పుడూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ జోనర్ ఎంతగానో నచ్చడం వల్లే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాను. పీఐ మీనా వెబ్ సిరీస్ నా మొదటి ప్రయత్నం. ఈ వెబ్ సిరీస్ అందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. కథ కు జీవం పోయడం మాత్రమే డైరెక్టర్ గా నేను చేశాను” అని డైరెక్టర్ దేబాలోయ్ భట్టచార్య పేర్కొన్నాడు. “స్క్రిప్టు లో పేజీలను సినిమాలాగా, వెబ్ సిరీస్ లాగా ముఖ్యంగా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడం ఎంతో కష్టమైన పని. కానీ, ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ వెబ్ సిరీస్ ను నేను తెరకెక్కించగలిగాను. ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలని ఉంది” అని దేబాలోయ్ భట్టచార్య తెలియజేసారు..
Also Read
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
-
DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!