NTV Telugu Site icon

Physical Harassment : బయటపడ్డ కీచక ఉపాధ్యాయుడు నిర్వాకం..

Teacher Phisical Harassment

Teacher Phisical Harassment

Physical Harassment : గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గు కూడిన కృత్యం. ఈ తరహా సంఘటనలు ఎప్పటికప్పుడు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాకినాడలో పాఠాలు చెప్పాల్సిన గురువే దుష్కృత్యం చేశాడు.

Rangareddy: బట్టల వ్యాపారికి లేడీవాయిస్‌ తో ట్రాప్‌.. కిడ్నాప్‌ చేసి కోటి డిమాండ్‌..

సమాచారం ప్రకారం, కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఇటీవల ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై అవగాహన సదస్సు నిర్వహించిన సమయంలో తమ అనుభవాలను మహిళా పోలీసులకు తెలియజేసిన విద్యార్థినులు, గురువు శ్రీనివాసరావు వారు చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారనే విషయాన్ని వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో శ్రీనివాసరావును కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈఓ అడ్డుకునేందుకు ప్రయత్నించినా, తల్లిదండ్రులు వినక, పోలీసులకు ఇచ్చి పట్టించుకోవాలని కోరారు. పోలీసులు, విద్యార్థినుల ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని, శ్రీనివాసరావుపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు అన్నారు.

Maharashtra: ఆరు నెలల్లోనే భారీ మార్పు.. “మహాయుతి” విజయంలో ఆర్‌ఎస్ఎస్ పాత్ర ఏంటి?