NTV Telugu Site icon

IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..

Indigo Flight

Indigo Flight

IndiGo Flight: ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇండిగో విమానం 6ఈ-1763 హైడ్రాలిక్ గ్రీన్ సిస్టమ్‌ను కోల్పోవడం వల్ల ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుందని విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 7.31 గంటలకు ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది.

Budget Sessions: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. రెండో విడత సెంట్రల్ విస్టాలోనే!

విమానం ఉదయం 6:25 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది. ఉదయం 7:22 గంటలకు ఎయిర్ టర్న్‌బ్యాక్ కోసం పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అవసరమైన నిర్వహణ కోసం విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌కి వెళ్లే విమానం కోసం ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ విమానం అందించబడిందఅని పేర్కొంది. నవంబర్‌లో ఎల్లో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా ఎయిర్ ఇండియా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ ముంబయికి మళ్లించబడింది. కన్నూర్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా సాంకేతిక లోపం కారణంగా ఈ నెలలో విమానాశ్రయానికి మళ్లించారు. ఫ్లైట్ 6E-1715ను ముందుజాగ్రత్తగా ముంబైకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Show comments