Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Phone Tapping Case Telangana Political Leaders 4200 Numbers Tracked

Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం.. 4200 మంది ఫోన్లు ట్యాప్

Published Date :June 18, 2025 , 12:27 pm
By Gogikar Sai Krishna
  • ఫోన్ టాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
  • అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారన్న అభియోగాలు
  • మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ఫోన్ ట్యాపింగ్
  • మొత్తం 4200 మంది ఫోన్‌లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు
Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం.. 4200 మంది ఫోన్లు ట్యాప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి.

G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్

2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారట. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటింరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి.

ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. నిన్న ఒక్కరోజే తొమ్మిది మంది సాక్షుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. అందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి సిట్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించారు.

Bayya Sunny Yadav: నేను వచ్చేశా.. సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ సన్నీ భయ్యా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • data privacy
  • Election Surveillance
  • Mahesh Goud
  • phone tapping
  • political Controversy

తాజావార్తలు

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions