Site icon NTV Telugu

Phone Tapping Case: కేసీఆర్‎కు మరోసారి నోటీసులు ఇవ్వనున్న సిట్!

Kcr (1)

Kcr (1)

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది వరుసగా బిఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‎కు నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసులో సిట్ కోరింది. అయితే, ఈ సిట్ నోటీసులపై కేసిఆర్ స్పందించారు. ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేనని తేదీని వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫార్మ్ హౌసే తన నివాసమని అక్కడే విచారణ జరపాలని సిట్ కు రిప్లై ఇచ్చారు కేసీఆర్.

సిఆర్పిసి 160లో ఒక పరిధిలోనే విచారించాలని ఎక్కడా లేదని కేసిఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని లేఖలో కోరారు. ప్రతిపక్షనేతగా బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫార్మ్ హౌస్ లోనే ఇవ్వాలని పేర్కొన్నారు కేసీఆర్. లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఇవాళ తదుపరి తేదీని ప్రకటించనుంది. విచారణ తేదీ విచారణ ప్రదేశం ఇతర అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకొని మరో నోటీస్ ఇవ్వనుంది.

Gold Rush: బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగులు.. షాపుల ముందు క్యూ కట్టి మరీ!

ఎర్రవల్లిలోనే ఎంక్వైరీ చేయాలన్న విన్నపం పైన సిట్ లీగల్ అడ్వైస్ తీసుకొనుంది. దీంతో తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు హైదరాబాద్ అంతట ఇక అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేస్ లో ఇవాళ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో కేసిఆర్ పిఏకు నోటీసులు జారీ చేసింది. 65 ఏళ్ళు దాటడంతో కెసిఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని తెలిపింది.

ఈ మేరకు కెసిఆర్ ముందు మూడు ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పిఎస్ లేదంటే నందినగర్ నివాసం అది కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని ఉదయం నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసిఆర్ నందినగర్ నివాసంలో విచారణకు ఒప్పుకుంటే క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ భద్రత ఏర్పాట్లను కూడా చూశారు.

Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!

మరోవైపు ఫోన్ టాపింగ్ కేసలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సీట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు కేసిఆర్ ఏం చెబుతారు అన్నది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. మరోవైపు లీగల్ ఒపీనియన్ అనంతరం కేసీఆర్ కి ఇవాళ సీట్ మరోసారి నోటీస్లు ఇవ్వనుంది. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరపనుంది. సీట్ మరోసారి 160 సిఆర్పిసి కింద కెసిఆర్ కి నోటీస్ ఇవ్వనున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో గులాబీ బాస్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసామన్న అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా కేసిఆర్ ను సీట్ విచారించునుంది. అయితే గత ప్రభుత్వాధినేత కెసిఆర్ కావడంతో సిట్ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది అనే ఆసక్తి నెలకుంది. దీనికి కేసిఆర్ ఎలా స్పందిస్తారు..? ఎప్పుడు విచారణ జరగనుంది? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Exit mobile version