Phone Tapping Case: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఐదు సార్లు విచారించారు. సుమారు 40 గంటల పాటు ప్రశ్నించినా.. ఆయన పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో విచారణ లోపించింది. ఈ విచారణ సందర్భంగా.. ఆయన సిట్ అధికారులను ఎక్కడా నేరుగా సమాధానాలు ఇవ్వకుండా.. “ఆధారాలు చూపించండి” అంటూ ఎదురు ప్రశ్నలు వేయడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
Read Also:Nakrekal: నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయనుంది సిట్. దీనికోసం సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. నేడు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలవుతుందని సమాచారం. సిట్ వర్గాల సమాచారం ప్రకారం.. కస్టోడియల్ విచారణ జరిగితే మాత్రమే మరిన్ని కీలక విషయాలు బయటపడతాయని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అనేక రహస్యాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. కొన్ని విషయాలను గుర్తు లేదని చెప్పడం, ఆధారాలు లేవని ధీమాగా తప్పించుకోవడం ప్రభాకర్ రావు వైఖరి అయినట్లు తెలుస్తోంది.
Read Also:Chandrababu and Lokesh: ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా లోకేష్..
ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సిట్ ముందస్తుగా చర్యలు తీసుకుని న్యాయబద్ధంగా కస్టడీకి అనుమతి తీసుకోవాలని చూస్తోంది. తదుపరి పరిణామాలపై అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.