NTV Telugu Site icon

Vasantha Krishna Prasad: ఆసక్తిగా మైలవరం రాజకీయం.. మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో ఫోన్

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మార్పులు చేర్పుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.. ఈ వ్యవహారం అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రులు.. ఇలా అందరిలోనూ టెన్షన్‌ పెడుతోంది.. అయితే, ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎంవో నుంచి మరోసారి ఫోన్‌ వచ్చిందట.. గతంలో పలుమార్లు ఆయనకు సీఎంవో నుంచి ఫోన్‌ వచ్చినా.. ఆయన స్పందించలేదనే ప్రచారం సాగాంది.. అందేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోను అంటూ వైసీపీ అధిష్టానికి ఆయన క్లారిటీగా చెప్పారనే చర్చ కూడా సాగింది..

Read Also: Disease for Women: మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి.. వస్తే జీవితాంతం భరించాల్సిందే?

అయితే, మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్‌ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.. ఈ వ్యవహారం మైలవరం రాజకీయాన్ని హీటెక్కిస్తోంది.. అయితే, సీఎంవో నుంచి కాల్‌ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయం అని.. లేదా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు అనేది వైసీపీ శ్రేణులను టెన్షన్‌ పెడుతోంది.

Read Also: AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!

కాగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్‌.. అధిష్టానం నుంచి పిలుపు రాకముందే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.. దీంతో, రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం.. చాలా సార్లు పార్టీ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. సీఎంవోకి రావాలని వసంతకు సమాచారం పంపించారు.. కానీ, ఆయన సీఎంవోకు వెళ్లాల్సిన సమయంలో హైదరాబాద్‌ లోనే ఉండిపోయారు. మరోవైపు, వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేష్‌కు చాలా కాలం నుంచి వివాదం నడుస్తూ వచ్చింది.. ఇది పలుమార్లు అధిష్టానం వరకు వెళ్లడం.. వారిని బుజ్జగించి పంపడం కూడా జరిగింది. అయితే, ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ను ఎమ్మెల్యే వసంత కలవనుండడం ఆసక్తికరంగా మారింది.

Show comments