AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వచ్చినా.. మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఏమైందని అయోమయానికి గురైన ఆటగాళ్లు.. చివరకు విషయం తెలుసుకుని నవ్వులు పూయించారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్ అంపైర్లు సిద్దమయ్యారు. అయితే సీటులో థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్‌లు ప్రారంభించలేదు. ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్‌లు చెప్పగా.. అతడు థర్డ్ అంపైర్ గదికి వెళ్లాడు. ఆ సమయంలో ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్‌లు చెప్పారు. ఆ వెంటనే ఇల్లింగ్‌వర్త్ తన సీటు వద్దకు వచ్చాడు. లిఫ్ట్ అపుడప్పుడు సరిగా పనిచేయదని తెలుస్తోంది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read: Delhi Fog: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 22 రైళ్లు, 134 విమాన సర్వీసుల్లో జాప్యం!
మ్యాచ్‌ను ఎందుకు ఆరంభించడం లేదని మైదానంలోని ప్లేయర్స్ కాస్త అయోమయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్‌ల ద్వారా విషయం తెలుసుకున్న ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అయితే పగలపడి నవ్వుకున్నాడు. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ తన సీట్లోకి వచ్చాక మ్యాచ్ ఆరంభం అయింది. మొత్తంగా 7 నిమిషాల తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
The game is delayed because the third umpire … is stuck in the lift #AUSvPAK pic.twitter.com/eSuKyPQp56
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..