Philippines: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజును క్రైస్తవులు ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అయితే క్రిస్మస్ వేడుకలు కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం కాని ఒక దేశం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఈ దేశంలో క్రిస్మస్ వేడుకలు సెప్టెంబర్లో ప్రారంభమై డిసెంబర్ వరకు అంటే నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. ఇంతకీ ఆ దేశం ఏమిటి, అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల ప్రత్యేకత ఏమిటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Tirumala: భక్తజనసంద్రంగా సప్తగిరులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం..
ఫిలిప్పీన్స్ దేశంలో క్రిస్మస్ వేడుకలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. ఈ సంప్రదాయ వేడుకలు బెర్ మాస సంప్రదాయానికి సంబంధించివి. ఫిలిప్పీన్స్లో క్రిస్మస్ సెప్టెంబర్లో ప్రారంభమై నూతన సంవత్సర దినోత్సవం వరకు కొనసాగుతుంది. వేసవి కాలం ముగిసే సమయానికి, క్రిస్మస్ కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయి. షాపింగ్ మాల్స్ నుంచి ఇళ్ల వరకు ఈ దేశంలో ప్రతిచోటా అలంకరణలు కనిపిస్తాయి. ఈ అలంకరణలను ఆ దేశంలో “బొంగా” అని పిలుస్తారు. దీని అర్థం గొప్ప, అద్భుతమైనది అని. ఫిలిప్పీన్స్లో నాలుగు నెలల పాటు జరిగే క్రిస్మస్ వేడుకలు బెర్ నెలల (-ber)లో స్టార్ట్ అవుతాయి. సంవత్సరంలోని చివరి నాలుగు నెలలు (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) “-ber”తో ముగుస్తాయి. వీటిని బెర్ నెలలు అంటారు.
ఈ నెలలు వేసవి ముగింపు, శీతాకాల రాకను సూచిస్తాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ పండుగను దేవుని స్మరణ, అలంకరణలు, ఇంటి నుంచి బయలుదేరిన వారు తిరిగి రావడం, పార్టీలతో జరుపుకుంటారు. అందుకే ఈ నెలలు ఇక్కడ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ నెలల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతాయి. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, ఇక్కడ మంచు కురవదు. ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ PAGASA ప్రకారం.. దేశ రాజధాని మనీలాలో డిసెంబర్ నెలలో సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ చాలా కుటుంబాలు తరచుగా వార్షిక క్రిస్మస్ పార్టీలను నిర్వహిస్తాయి, వాటికి నిర్దిష్ట దుస్తుల కోడ్ కూడా ఉంటుంది. ఉదాహరణకు అర్బోలెడా కుటుంబం నిర్వహించిన పార్టీలకు సంబంధించిన డ్రెస్ కోడ్ గమనిస్తే.. ఆ పార్టీకి వచ్చే వారు ధరించే టీ-షర్టులపై “అర్బోలెడా ఫ్యామిలీ రీయూనియన్ 2025” అని రాసి ఉంటుంది. ఈ పార్టీలో వివిధ రకాల ఆహారం, పానీయాలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడి చాలా కుటుంబాలు క్రిస్మస్ వేడుకల సమయంలో “సంవత్సరపు రంగు”ని ఎంచుకుంటారు. వాళ్లు ఎంచుకున్న రంగును ఏడాది పొడవునా ధరించాలని ప్రతిజ్ఞ కూడా చేస్తారు.
READ ALSO: Tollywood: వైరల్ కోసం విలువల బలి! పచ్చి బూతులతో యువతకు వల.. సిని ‘డర్టీ’ పిక్చర్!