Site icon NTV Telugu

Supreme Court: ‘ఇండియా’ పేరుపై పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

India

India

Supreme Court: 26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రతిపక్ష కూటమి పేరు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌) అని తెలిసిందే. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ‘మీరెవరు? మీ ఆసక్తి ఏమిటి? ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించండి.. మీకు పబ్లిసిటీ కావాలి, పూర్తి ప్రచారం కావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. రాజకీయాల్లో నైతికతను నిర్ణయించడం లేదని.. దీనిపై ప్రజలు సమయాన్ని వృథా చేయడం బాధాకరమని జస్టిస్ కౌల్ అన్నారు.

Also Read: Mobiles Ban In School: స్కూల్స్ లో మొబైల్‌ ఫోన్స్ నిషేధం.. ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ సర్కార్‌

కేసును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించడంతో.. బెంచ్ న్యాయవాది అభ్యర్థనను అనుమతించి, పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు కొట్టివేసింది. అన్ని మీడియా ఏజెన్సీలు ప్రతిపక్ష కూటమికి “I.N.D.I.A” పేరును ఉపయోగించకుండా ఉండేలా ఒక నియంత్రణను ఆమోదించడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరింది. ఈ కూటమికి చెందిన పార్టీ కార్యకర్తలు రాబోయే ఎన్నికలలో కేవలం దేశానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్న తప్పుడు కథనాన్ని సాధారణ ప్రజల మనస్సుల్లో సృష్టించేందుకు నినాదాలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version