NTV Telugu Site icon

UP: సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి.. ఇద్దరు పోలీసులు సస్పెండ్

Up

Up

యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్‌చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్‌లోని జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. దేవేంద్ర అనే వ్యక్తి రెండు నెలల క్రితం హుస్సేన్ మహమ్మద్ వివామ వేడుకలో బ్యాండ్ వాయించాడు. అందుకుగాను రూ. 5 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకపోవడంతో షాపులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే.. అదే షాపులో పనిచేస్తున్న రాకేశ్ అనే 52 ఏళ్ల వ్యక్తి వారిద్దరినీ విడదశీడు. ఆ తర్వాత.. గొడవపై దేవేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, ముగ్గురిని ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.

Pankaja Munde: ఎక్కి ఎక్కి ఏడ్చిన పంకజా ముండే

అయితే.. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌లో కూర్చొని ఉండగా రాకేష్ కుప్పకూలిపోయాడని దేవేంద్ర తెలిపాడు. దీంతో పోలీసులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నిధౌలి కలాన్ నుండి వైద్య కళాశాలకు పంపారు. అక్కడి చేరుకున్న తర్వాత.. చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్, ఎస్‌హెచ్‌ఓ జేపీ అశోక్‌ను సస్పెండ్ చేశారు.

ఈ కేసులో.. దాడికి సంబంధించి ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఎస్‌ఎస్‌పి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో సాక్షిగా రాకేష్ ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌హెచ్‌ఓ నిధౌలీ కలాన్, మున్షీని సస్పెండ్ చేశారు. రాత్రి పూట ఆహారం ఇవ్వకపోవడం, తెల్లవారుజామున ఎండవేడిమికి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది.