Site icon NTV Telugu

Harish Rao vs Perni Nani: తెలంగాణ మంత్రి హరీష్ రావు పై.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Nani

Nani

చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు..
హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు. కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి.. అల్లుడి గిల్లుడికి సమాధానం ఇస్తాడు అని ఆయన తెలిపాడు.

Read Also: Tirupati Reddy: హాట్ కేక్‎లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!

ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ కు వావి వరుసలు లేవు.. బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు.. కృష్ణా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ఊర్లలోనే ఎందుకు వారాహి యాత్ర చేస్తున్నాడు.. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే చోట్ల ఎందుకు మీటింగ్ లు పెట్టడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. మా అందరి కంటే ప్రజలు తెలివైన వాళ్ళు.. వాళ్ళకు అన్ని తెలుసు అని పేర్నినాని అన్నారు.

Read Also: Perni Nani: చేసిన పాపాలు, ఘోరాలే ఇవాళ చంద్రబాబును వెంటాడుతున్నాయి

చంద్రబాబు నిప్పు లాంటి వ్యక్తి అని మీ కుటుంబం నమ్మితే నా సవాల్ స్వీకరించాలి అని పేర్నినాని అన్నారు. 1995లో కుట్రతో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినప్పటి ఇప్పటి వరకు మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ఆయన అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు స్టేలపై బతుకుతున్నాడు.. అవినీతి కేసులు ఎదుర్కొన్న జాతీయ స్థాయి నాయకులు సైతం ఇలాంటి టప్పుటమార విద్యలు ప్రదర్శించ లేదు.. కేసులను న్యాయపరంగా ఎదుర్కొన్నారు అని పేర్నినాని అన్నారు.

Exit mobile version