NTV Telugu Site icon

Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..

Nani

Nani

Perni Nani: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్‌ ముగియగా.. మరో రెండు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు.. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది.. టీడీపీ సభ్యులను కొందరని సస్పెండ్‌ చేస్తూ.. అందరూ సభ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నొనాని.. ఒప్పందంపై చంద్రబాబు మొత్తం 13 చోట్ల సంతకాలు చేశారని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు ప్రశ్నిస్తే కాదు.. లేదు అని డైలాగ్‌లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు. ఐఏఎస్‌ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు పేర్ని నాని.

Read Also: MLC Kavitha: రజాకార్ సినిమాను తిరస్కరించండి.. తెలంగాణ ప్రజలకు కవిత పిలుపు..

చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యంగా పేర్కొన్నారు పేర్ని నాని.. కేవలం సాంకేతిక కారణాలే కోర్టుల్లో చెబుతున్నారని.. చంద్రబాబు జైలుకెళ్లగానే ఆయన సీట్లో బాలయ్య కూర్చున్నారు.. అసెంబ్లీలో కూడా బాబు చైర్‌లో కూడా బాలయ్య నిలబడ్డారని సెటైర్లు వేశారు. చంద్రబాబు స్కామ్‌ ఏంటన్నది మనవడికి కూడా అర్ధమవుతోందని విమర్శించారు. సీమెన్స్‌ రూ. 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందంలో లేదు.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుట్ర అమలు చేశారని ఆరోపించారు. డిజైన్‌టెక్‌ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేశాడని.. చంద్రబాబు డబ్బును ఎత్తేయడంలో ఎంతో ఆత్రంగా వ్యవరించారు.. స్కిల్‌ స్కామ్‌లో ఏం జరుగుతుందో చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికీ అసలు విషయం తెలియని సంచలన ఆరోపణలు చేశారు. డొల్ల కంపెనీలకు స్కిల్‌ నిధులు మళ్లించడం.. అక్కడ నుంచి హవాలా ద్వారా చంద్రబాబు ఖాతాలోకి నిధులు చేరాయని చెప్పుకొచ్చారు.. జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకున్నారు విమర్శించారు.. ఈ దొంగతనానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని..