NTV Telugu Site icon

Perni Nani vs KTR: కేటీఆర్‌ కామెంట్లకు పేర్నినాని కౌంటర్‌.. హరీష్‌ది మహా తెలివైన బుర్ర..!

Perni Nani Vs Ktr

Perni Nani Vs Ktr

Perni Nani vs KTR: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.. అయితే, ఇది మా వళ్లే సాధ్యం అయ్యిందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే నన్న ఆయన.. మేం తెగించి కొట్లాడాం.. కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసింది.. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందని.. కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లా ఉంటుంది మరి అని వ్యాఖ్యానించారు.. అయితే, కేటీఆర్ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని.. కేటీఆర్ మాటలు ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్లు ఉంటుంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వీళ్ళను చూసి తగ్గిందా? మరి తెలంగాణలో ఎందుకు తగ్గటం లేదు? అని సెటైర్లు వేశారు పేర్ని నాని.

ఇక, హరీష్ రావుది రాజకీయాల్లో మహా తెలివైన బుర్ర.. చంద్రబాబులా మామను వెన్నుపోటు పొడవటానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్నినాని.. మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారు.. హైదరాబాద్ లో, సిద్ధిపేటలో రోడ్లు బాగుంటే చాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పై కడుపు రగిలినప్పుడల్లా మిమ్మల్ని కెలుకుతుంటాడు.. మా చేత కేసీఆర్ ను తిట్టిస్తాడు అంటూ వ్యాఖ్యానించారు. మా ప్రజల మీద ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో హరీష్ రావు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.. ఇప్పుడు బీఆర్ఎస్ అనాలా? టీఆర్ఎస్ అనాలా? అని ఎద్దేవా చేసిన ఆయన.. బీఆర్ఎస్ బ్యాక్ టు పెవిలియన్ కు వెళ్ళిపోయిందా? దిండి, పాలమూరు ప్రాజెక్టులు దొంగతనంగా పెట్టుకోవటం కాదా? అని ప్రశ్నించారు పేర్నినాని.

Show comments